నేనెరిగిన బాలకృష్ణయ్య

డాక్టర్ బాలకృష్ణయ్యగారి రాజకీయ ప్రవేశం వనపర్తి రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేసింది. స్థానికంగా ఆయన ఒక సాధికారికమైన నేత అయ్యారు. ఇదంతా ప్రారంభంలోని రెండు మూడేళ్లలోనే జరిగింది.

మహామనిషి

నేటికీ వనపర్తిలో ‘డాక్టర్ సాబ్’ అన్నమాట ఒక్క బాలకృష్ణయ్యగారికే అన్వయించబడుతుంది. ఆయన ప్రాక్టీస్ చేసినంతకాలం ప్రజలు ఇతర డాక్టర్లకు కన్సల్టింగ్ ఫీజు ఇచ్చే అలవాటు లేకుండానే గడిపారు.

చనిపోయిందనుకున్న మనిషి 10-15 సంవత్సరాలు బ్రతికింది

బాలకృష్ణయ్య గారు చెప్పిన మాట గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది: ‘ఆమె చనిపోలేదు, బతికే ఉంది! అని చెప్పారు

ఈ మాటలు వినగానే గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. ఆయన శ్రమించి, తక్షణమే ఆ మహిళకు వైద్యం అందించటంతో, ఆమె గుండె కొట్టుకోవడం మొదలైంది. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ! ఆ మహిళ దాదాపుగా 10-15 సంవత్సరాలు  జీవితం గడిపింది

మళ్ళీ మాకో బాలకృష్ణయ్య కావాలి

1957-58లో వారితో నా మొదటి పరిచయం. అప్పుడప్పుడే ఆయన వైద్యవృత్తిని ప్రారంభించిన కాలమది. వనపర్తికి చెందిన వారవటం వల్ల ఆయన ప్రాక్టీస్ ఊపందుకోవడానికి అట్టే కాలం పట్టలేదు. ఫీజు లేకుండా వైద్యం చేయడం కూడా మరో కారణం.

మంచిమనిషి – మానవతామూర్తి

మానవ సంబంధాలు, మానవతా విలువలు దిగజారిపోయిన యాంత్రిక సమాజంలో డాక్టర్ బాలకృష్ణయ్యని స్మరించుకోవడం మళ్లీ మంచి సమాజం కోసం ఆశలను చిగురింపజేసుకొనడమే

ఆర్ద్రహృదయుడు

వానలో తడువనివారు. డా బాలకృష్ణయ్య గారి మంచితనం గురించి తెలియనివారు వనపర్తి ప్రాంతంలో ఎవరూ ఉండరు, రోగుల బాధలు బాపిన వైద్యునిగానే కాక, ఆర్తజనులను ఆదుకొన్న ఆపద్బాంధవునిగా అందరి అభిమానాన్ని చూరగొన్న ‘ప్రజల మనిషి’ ఆయన.

పేదల పెన్నిధి డాక్టర్ బాలకృష్ణయ్య

డాక్టర్ బాలకృష్ణయ్యది బహుముఖ వ్యక్తిత్వం. నిజమైన ప్రజా డాక్టర్, ప్రజా నాయకుడిగా ఆయన చిరస్మరణీయమైన స్థానం పొందారు. అద్భుతమైన తన హస్తవాసితో ధనరాసుల్లో తులతూగే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ అందుకు ప్రయత్నం చేయలేదు.

విద్యారంగ సేవలో డాక్టర్ బాలకృష్ణయ్య

vidhyaranga-sevalo-balakrishnhaiah

తన ప్రాంత ప్రజలు నిరక్షరాస్యులుగా ఉంటే ఏదేని విషయంలో వారిని చైతన్యపరచడం కష్టమని భావించి ఆనాడే రాత్రిపూట బడులు పెట్టించి ఎందరికో చదువు చెప్పారు. చెప్పించారు