పేదల వైద్యుడు – పేదల నాయకుడు

ఒక ఆదర్శవాద డాక్టరుగా చూడాలనుకున్నా డాక్టరు ప్రగతిశీల భావజాలానికి కూడా చెందిన వాడు కావడంతో మాకు స్నేహం పెరిగింది. అయితే 1968లో నేను జడ్చర్ల వదిలేనాటికి కూడ నాకే స్పష్టంగా విప్లవ రాజకీయాలు అబ్బలేదు గనుక అప్పటికి మా కలయికలూ తక్కువే.

మైనారిటీలకు ఆత్మబంధువు

వనపర్తి పట్టణంలో లౌకిక భావనకు ఆయన ఒక ప్రతీక! మైనారిటీలను, అల్పసంఖ్యాకులను చులకనగా చూడటం డాక్టర్ సాబ్ కాలంలో లేదు. ప్రజల మధ్య ఐక్యతయే వాళ్లకు రక్ష అనుకున్నారు.

వనపర్తి ప్రజల సత్కారం నోబెల్ మించిన పురస్కారం

ఇంతవరకు నా జీవితకాలంలో నాకు ఎన్నో సన్మానాలు జరిగాయి కానీ ఇంత గొప్ప సన్మానం ఎప్పుడూ ఎక్కడా జరగలేదు. ఈ సన్మానాన్ని నేను జ్ఞానపీఠ బహుమతి కంటే, నోబెల్ బహుమతి కంటే గొప్పగా భావిస్తున్నాను.

ఆయన్ని స్మరించుకుంటూ అంతర్మధనం చేసుకుంటున్నాను

వనపర్తిలో పెనుతుఫాను సంభవించి, జనజీవనం అతలాకుతలం కాగా, ఆ సమయంలో పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకై డాక్టర్ సాబ్ చేసిన సేవ అనితర సాధ్యము, వారి నాయకత్వ ప్రతిభ స్ఫూర్తిదాయకం.

పాలమూరు మానవతా మట్టి శిఖరం

ప్రజలే తన శ్వాసగా భావించి, మంచితనం మానవత్వం ఈ భూమ్మీద స్థిరంగా ఉండాలని ఆశించిన ఆశాజీవి డాక్టర్ బాలకృష్ణయ్య.

సిసలైన సోషలిస్టు

నిజాం వ్యతిరేక పోరాట కాలంలో బాలకృష్ణయ్య వామపక్ష పార్టీ పట్ల ప్రభావితుడైనారు. పార్టీ సానుభూతి పరుడిగా ఈ ప్రాంతంలో వామపక్ష ఉద్యమాలకు తొలిబీజం వేశారు. కాలక్రమంలో వామ పంథా భావాలున్న చాలామంది యువకులు ఆయన అనుచరులైనారు. ఇతర పార్టీలకు వ్యతిరేకులైనా వ్యక్తులకు ఆయన ఏనాడూ వ్యతిరేకి కాలేదు.

మేమిద్దరం ఒకేలా

డాక్టర్ గారు, నేను ఇరువురమూ ఒకేలా ఉండటం కాదు ఇద్దరమూ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నాము. కానీ నేను గాంధేయవాదినైతే ఆయన వామపంథావాది. ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కావాలని, చైనా
దేశ జీవనవిధానం అవలంబనీయమని చెప్పేవారు.

నేనూ-బాలకృష్ణయ్య

నిజాయితీ, నిబద్ధత, సేవాభావం నిలువెల్లా నింపుకున్న డాక్టర్ గారితో కలిసి పనిచేయటం నా జీవితంలో అన్నిటికన్నా గొప్ప విషయం. ఆయన అటు వనపర్తిలో, నేను ఇటు కడుకుంట్లలో 20సం.రాల పాటు సర్పంచ్ గా కొనసాగి నాటి పంచాయితీ సమితిలో కలిసి పనిచేసినాము.

ఆయనొక కర్మయోగి

ఆనాడు పేదలు, దగాపడ్డ తమ్ముళ్లు, దరిద్ర దామోదరులు, పీడితజనం వీరందరు డాక్టరు గారికి ఆత్మీయులే. ఒక్క పైసా తీసుకోకుండా తన జీవితాంతం వారికి వైద్యం చేశారు. వారి వైద్యానికి విలువకడితే అది ఈనాడు కోట్ల రూపాయలవుతుంది.

ఆ నిశ్శబ్ద విప్లవానికి జేజేలు

డాక్టర్ బాలకృష్ణ “చిరునవ్వు” కత్తిలా ఎప్పుడూ మెరుస్తూ నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఆ కత్తి ఎవరికీ అపకారం చేయలేదు. మొండికేసిన రోగాల్ని అది నయం చేయడానికి “శస్త్రచికిత్స” చేసింది. ఫ్యూడల్ ‘వనపర్తి’ సంస్థానంలో డాక్టర్ బాలకృష్ణ ఒక ‘నిశ్శబ్ద విప్లవం’- ఆ నిశ్శబ్దవిప్లవానికి జేజేలు