ఆయనొక మహా వెన్నెల

శ్రీమతి అంజనీ బాలకృష్ణ

డాక్టర్ బాలకృష్ణయ్య అన్న పేరులోనే ఏదో మహత్తు ఉందనిపిస్తుంది. ఆయనతో నా పెళ్లి జరిగింది 1950లో. అప్పుడాయన మెడిసిన్ రెండో సంవత్సరం పరీక్షలు రాశాడనుకుంటా. కానీ అప్పటికే ఆయన స్వాతంత్య్ర సమరయోధుడిగా యువనేతగా చాలా పేరున్నవారు. నేను నలుగురన్నల ముద్దు చెల్లిగా కట్టుబాట్లలో పెరిగినా బాలకృష్ణ జీవితంలోకి ప్రవేశించిన తరువాతనే ప్రజల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. కుటుంబం కన్నా ఆయన ప్రజలను ముఖ్యంగా పేద రోగులకు సేవ చేయాలనే తపనలోనే ఉండేవారు. వనపర్తి పట్టణ సర్పంచుగా, మున్సిపల్ చైర్మన్ గా, శాసనసభ్యుడుగా ఆయన 50 ఏళ్లపాటు ప్రజాసేవలో తన జీవితాన్ని పునీతం చేసుకున్న మనిషి.

0018
dr. bhupesh kumar Dr. Balakrishnaiah Wanaparthy

మా నాన్న

డా.భూపేష్ కుమార్

వేల సంవత్సరాల రాజరికపు వ్యవస్థకు, నియంతృత్వానికి ఒక సామాన్యుడిగా ఒంటరిగా ఎదురొడ్డి నిలిచి, ఒక్కడే వేల ప్రజల నేతగా ఎదిగి మా నాన్న చేసిన పోరాటం రాజుల నిరంకుశవిధానాలను తుత్తునియలు చేసింది. ఒక మనిషి బహుముఖ ప్రతిభావ్యుత్పత్తులతో తన తరాన్ని మాత్రమే కాదు, భావితరాలను సైతం ప్రభావితం చేసి అభ్యుదయ సమాజనిర్మాత అన్న మాటకు “కొండగుర్తు”గా నిలుస్తారనడానికి మా నాన్న జీవితం ఓ తిరుగులేని ఉదాహరణ.

మమతల నెలవు మా నాన్న

డా.జయంతి

మాకు తెలుసు మానాన్న బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన వ్యక్తిత్వానికి ఎన్నో కోణాలున్నాయి. ప్రతి కోణం పరిపూర్ణమైందే. వైద్యం ఆయన ముఖ్యవృత్తి, సాహిత్యాభిమానిగా, కళాభిమానిగా, సంఘసంస్కర్తగా, విప్లవాభిమానిగా రైతుగా, న్యాయమూర్తిగా, రాజకీయవేత్తగా మరెన్నో ప్రవృత్తులు ఆయనలో నిబిడీకృత మయ్యాయి. వ్యక్తిగా మృదుభాషి, సంస్కారి, స్నేహశీలి, కరుణ, దయ అన్నింటినీ మించి ”అందరూ నా వారే’ అని అనుకునే ఆత్మీయత, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వ నిర్మాణంనుండి విడదీయరాని మణిపూసలు.

0059
0054

మా అన్నయ్య

శ్రీ ప్రమీలా రాణి

1947. ఆరోజు 15 ఆగస్టు, విద్యార్థి నాయకుడుగా బాలక్రిష్ణగారు వేణుగోపాలస్వామి ఆలయావరణలో జాతీయజండా ఎగురవేయవలసి ఉండెను. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరైనారు. వారు జాతీయ జండా ఎగురవేస్తే వారిని పోలీసులు స్వాధీనపరచుకున్నారు. ఆయనను అరెస్టు చేసినందుకు నిరసనగా విద్యార్థులంతా ఉరేగింపు జరిపినారు. ఆ దృశ్యం ఇంకా నాకు కళ్లముందు కదలాడుతూనే ఉంది.