కీర్తి విముఖుడు
డాక్టర్ బాలకృష్ణయ్య గారితో సుమారు పాతికేళ్ల స్నేహానుబంధం నాది. పలు ప్రజాసంఘాల్లో మేమిరుపురం కలిసి పనిచేశాం. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఆయన. ఒక వైద్యుడిగా పేదలకు ఆయన అందించిన సేవలే ఆయన్ను ప్రజలకు చేరువ చేసినవి. వైద్యం వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో డా. బాలకృష్ణయ్యను ఆదర్శంగా తీసుకునేవారులేరేమో.
డాక్టర్ గారు పలు వామపక్ష ఉద్యమాలతో సన్ని హిత సంబంధం గలవారు. విరసం సానుభూతి పరుడు. పలువురు సాహిత్యకారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. “పౌరహక్కుల కమిటీ”కి నేను కార్యదర్శిగా, శ్రీశ్రీ అధ్యక్షులుగా ఉన్నపుడు డా. బాలకృష్ణయ్యగారు వనపర్తి పట్టణం లో పౌరహక్కుల మహాసభలు నిర్వహించారు. బహుశా ఆ ఉత్తేజంతోనే కావచ్చు, శ్రీశ్రీ చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపుడు ఆయన పలువురిచే విరాళాలు పోగుచేసి అందజేశారు. మొదట మేమంతా హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయంలో శ్రీశ్రీకి సన్మానం చేసినపుడు డాక్టర్ గారి సహకారం ఉంది. ఈ సభలోనే అనుకుంటా ఒక మహిళ తన చేతులకున్న రెండు బంగారు గాజులను విరాళాల జోలెలో వేసింది. వాటిని తీసుకోకుండా తిరిగి ఆమెకి అంద జేయాలని ప్రయత్నించినా ఆమెనరో కనుక్కో లేకపోయాం.
ఈ సభ తరువాతనే డా. బాలకృష్ణయ్య వన పర్తిలో శ్రీశ్రీకి ఘనసన్మానం ఏర్పాటుచేసి పాతిక వేలు బహూకరించారు. ఆ రోజుల్లో ఇది చాలా పెద్ద మొత్తం. ఈ ఒక్క విషయం చాలు డాక్టర్గారి గొప్పతనం గురించి చెప్పడానికి, విరసం రచ యితల అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రసారస్వత పరి షత్తులో జరిగిన సభకుకూడా డాక్టర్గారి సహకారం చాలా ఉంది.
ఒక వైద్యుడిగా బాలకృష్ణయ్యగారు శక్తికొలది కాదు శక్తికి మించి రోగులకు సేవచేశారు. ఢిల్లీలో భారత- చైనా మిత్రమండలి కాన్ఫరెన్స్ జరిగినపుడు పేరు గుర్తులేదు కానీ గాంధీగారి అనుంగు శిష్యుడు ఒకాయన వేదికపై ప్రసంగిస్తూనే పడి పోవడంతో బాలకృష్ణయ్యగారు వెంటనే చికిత్స చేయడంతో ఆయన కోలుకోవడం జరిగింది.
కాగా భారత-చైనా మిత్రమండలి కార్య కలాపాల్లో బాలకృష్ణయ్యగారుచాలా ఉత్తేజకరంగా పాల్గొనేవారు. ఆ సందర్భంలోనే మా ఇద్దరి మధ్య మైత్రి బలపడింది. హైదరాబాదు, ఒంగోలు, వనపర్తి పట్టణాల్లో భారత-చైనా మిత్రమండలి సభలు నిర్వహించారాయన. ఢిల్లీలో జరిగిన సమా వేశాలకూ ఆయనే ముందున్నారు. ఆ తరువాతనే ఆయన భారత-చైనా మిత్రమండలి జాతీయ కార్యదర్శిగా చైనా పర్యటన చేశారు.
ప్రగతిశీలభావాలు గల ఆయన పలు వామ పందా భావజాలంగల ఉద్యమాల్లో భాగస్వామ్యం పొందేవారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఆయనలో ఎక్కువ. తానేగాదు. తన సాటివారిని సైతం ఉత్సాహపరిచి తన వెంట నడిపించుకు వెళ్లే నైజం ఆయనది. చాలా సందర్భాల్లో సిడియస్్యు సభల నిర్వహణలో ప్రధాన పాత్ర వహించిన బాలకృష్ణయ్య మహబూబ్నగర్ జిల్లా పౌరహక్కుల సంఘంకు అధ్యక్షులుగా, రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసన గా తలపెట్టిన ఉద్యమాలలో డాక్టర్గారు పాల్గొ న్నారు. అప్పటి ఎన్కౌంటర్ మృతుల వివరాలు సేకరించిన వారిలో వారూ ఉన్నారు. ఇంకా కిష్టా గౌడ్, భూమయ్యల ఉరిశిక్ష రద్దుకు జరిగిన పలు ఉద్యమాల్లో డాక్టర్గారు పాల్గొన్నారు. చెరబండ రాజుతో ఆయనది దగ్గరి స్నేహం.
డాక్టర్ బాలకృష్ణయ్య ప్రజాసేవకు త్రికరణ శుద్ధిగా పాటుపడిన మనీషి, ఎవరి మెప్పుకోసమో. కీర్తికండూతితోనో గాక హృదయపూర్వకంగా ప్రజా హితానికి పాటుపడినవారు. నేడు వ్యాపారమయ మైన వైద్యరంగంలోని ప్రతి డాక్టరూ బాలకృష్ణయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.