చనిపోయిందనుకున్న మనిషి 10-15 సంవత్సరాలు బ్రతికింది
ఐదు సంవత్సరాల క్రితం నేను WCCM డిగ్రీ కళాశాలలో పని చేస్తూ, సమ్మర్ హాలిడేల్లో కాన్వాసింగ్ కోసం ప్రతి పల్లెటూరు తిరుగవాళ్ళం. ఆ సందర్భంగా నేను చిమనగుంటపల్లి గ్రామానికి వెళ్ళినపుడు, అక్కడి ప్రజలు డాక్టర్ బాలకృష్ణయ్య గారి గురించి మాట్లాడుకుంటూ ఉండటం విన్నాను.
ఆ గ్రామస్తుడు చెప్పిన సంఘటన నాలో తీవ్రమైన భావోద్వేగాలను రేకెత్తించింది:
“ఒకసారి, డాక్టర్ బాలకృష్ణయ్య గారు చిమనగుంటపల్లి ప్రాంతంలో జీపులో ప్రయాణిస్తుండగా, జీపు టైర్ పంచర్ అయింది. ఆ సమయంలో డాక్టర్ గారు నడుచుకుంటూ గ్రామంలోకి వెళ్తుండగా, ఒక వ్యక్తి మరణించిన తన బంధువు అంత్యక్రియల ఏర్పాటులో నిమగ్నమై ఉన్నారు. ఆమెను పాడే మీద ఎక్కించేందుకు సిద్ధమవుతూ ఉండగా, బాలకృష్ణయ్య గారు ఆ ఘటనను గమనించారు.
ఆమెను దగ్గరగా పరిశీలించి, డాక్టర్ బాలకృష్ణయ్య గారు చెప్పిన మాట గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది: ‘ఆమె చనిపోలేదు, బతికే ఉంది! అని చెప్పారు
ఈ మాటలు వినగానే గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. ఆయన శ్రమించి, తక్షణమే ఆ మహిళకు వైద్యం అందించటంతో, ఆమె గుండె కొట్టుకోవడం మొదలైంది. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ! ఆ మహిళ దాదాపుగా 10-15 సంవత్సరాలు జీవితం గడిపింది అని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు.
నిజానికి, మనం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా సినిమాల్లో చూస్తాం. కానీ ఇది నిజంగా జరిగింది అంటే నాకు చాలా గొప్పగా అనిపించింది.