ఆ నిశ్శబ్ద విప్లవానికి జేజేలు
“వనపర్తి” మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సంస్థానం. “ఫ్యూడల్ సమాజం వంశపారంపర్యత”కు ప్రాముఖ్యత. రాజావారి కనుసన్నల్లో మెదిలే పరాధీనత రాజావారి “ఆధునికత” కూడా ఫ్యూడల్ దర్పాన్ని దోపిడీని కాపాడేదే ఆలయాలు పూజలు వేడుకలు పంచాంగాలు, హరికథలు, దసరా, నవరాత్రులు, దీపావళి పండుగలు, చివరకు “బతుకమ్మ” ఆటలు ‘పాలపిట్ట’ దర్శనాలు ఆయుధ పూజలు ‘జమ్మిచెట్టు’ ఆకులు అలములు, “వెండి బంగారాలు”గా ఎదురైన వారిని కౌగలించుకుని “శుభాకాంక్షలు” చెప్పుకునే ఆచారాలు, కవులు, కవి సమ్మేళనాలు అన్నీ “ఫ్యూడల్ సమాజ” ఔన్నత్యానికి ఉపయోగపడే సాధనాలే.
రాచరికాన్ని, సంస్థానాలను కాదని ప్రజలు పోరాడి తెచ్చుకున్న “దేశ స్వాతంత్య్రం” (అధికార మార్పిడి 15.8.1947) కూడా “పార్లమెంటరీ పంథా” ఎన్నికల పద్మవ్యూహంలో తిరిగి సంస్థానాధిపతులే శాసనసభ్యులు, పార్లమెంట్ మెంబర్లయ్యారు. మనదనుకున్న ప్రపంచం మనది కాకుండాపోయే దుర్మార్గస్వర్గం ఒక ‘పేడ’లా ప్రజలమీద పడింది.
ఈ సంస్థానాలు ఆధునిక అవతారం ఎత్తగానే అని తిరిగి, ఫ్యూడల్ ప్రభువుల ఇష్టారాజ్యాలయ్యాయి. వారి సాంఘిక సంస్కరణలు, ఆధునికత, విద్యాలయాలు, భూసంస్కరణల్ని గల్లంతు చేశాయి. ప్రజలు తిరిగి పావుకాయలయ్యారు. ఫ్యూడలిజాన్ని ప్రతిఘటిస్తూ వచ్చిన ప్రజాస్వామిక ఉత్కంఠకు ప్రతినిధిగా ఎన్నో ఉద్యమాలు బయల్దేరాయి. ఆ ఉద్యమాల్లో తిరుగులేని ప్రతినిధిగా డాక్టర్ బాలకృష్ణయ్య ‘వనపర్తి’ సంస్థానంలో రంగప్రవేశం చేశారు. మొదట మాయదారి ఎన్ని కల్లో ఎన్నుకోబడని ప్రతినిధిగా డాక్టర్ బాలకృష్ణ ఊపిరి పోసుకున్నా ప్రజల అభివ్యక్తిగా అభివృద్ధి చెందినా ఫ్యూడల్ నాగరికత తగిన చోటు ఈయలేదు.
డా. బాలకృష్ణయ్య ప్రజావైద్యం ఒక సంస్కృతిగా అభివృద్ధి చెందింది. ప్రజల పంచాయితీలో తిరుగులేని నాయకుడయ్యాడు. ‘సంస్థానాధిపతి’ రాజా రామేశ్వరరావు “ఫ్యూడల్ పట్టు” సడలేట్టు ఒక “శక్తి”గా చొచ్చుకు వచ్చాడు. ‘హోరాహోరి’ ఎన్నికల్లో వెంట్రుకవాసిలో వెనుకపడ్డాడు.
“స్వయంభూ”లా రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీరామారావు గార్కి ‘డాక్టర్ బాలకృష్ణయ్య’ ప్రజాబలాన్ని పరిగణనలోకి తీసుకోకతప్పలేదు. అలా శాసన సభ్యత్వాన్ని గెలుచుకున్న డాక్టర్ బాలకృష్ణయ్య “ఎరుపు పునాదుల్ని” పసికట్టి, మంత్రివర్గానికి దూరంగా ఉంచారు. ఎరుపువారి మద్దతుతో అధికారంలోకి వచ్చినా లోనా, బయటా “ఎరుపు”ను దూరంగానే ఉంచడమేగాక, అవకాశం వచ్చినప్పుడల్లా అణచివేశాడు. కాబట్టే ఏకాకిగా నిష్క్రమించక తప్పలేదు కుట్రల కుహనాల్లో
డాక్టర్ బాలకృష్ణయ్య ఒకరకంగా చెప్పాలంటే ‘వనపర్తి’ సంస్థానంలో ఉనికిలోకి వస్తున్న ప్రజాస్వామిక చైతన్యానికి ప్రతినిధి. ఫ్యూడలిజం పట్టు సడలడా నికి ఏర్పడ్డ ఆగ్రహ నిగ్రహం.
డాక్టర్ బాలకృష్ణయ్య స్ఫురద్రూపి కత్తిలాంటి చిరునవ్వు – ప్రవృత్తి రీత్యా ప్రజాసేవ- వృత్తిరీత్యా వైద్యుడు. ఎక్కడా వృత్తికి ప్రవృత్తికి వైరుధ్యం రానీయలేదు. ప్రజలు నొచ్చుకునే పని ఏదీ చేయలేదు. ప్రయోజకులైన పిల్లలు డాక్టర్ బాలకృష్ణయ్యకు “సంస్కారవారసులు”గానే ఎదిగారు కాని, ‘ఆస్తి వారసులు’గా తగాదా పడలేదు. సంతానంలో డాక్టర్లు, సాహితీప్రియులు, సంఘసేవకులు ఉన్నారు.
డాక్టర్ బాలకృష్ణ ఒకరకంగా చెప్పాలంటే ‘వన పర్తి’కి పర్యాయపదంగా నిలిచాడు. ప్రజా చైతన్యానికి, హక్కుల పోరాటాలకు, ప్రజాస్వామ్యానికి బాసటగా నిలిచారు డాక్టర్ బాలకృష్ణయ్య “అహం బ్రహ్మాస్మి” అనుకునే ఎన్టీఆర్ మొదటి రాజకీయ సంక్షోభంలో డాక్టర్ బాలకృష్ణయ్య ఎన్టీఆర్ పక్షానే నిలిచాడు. విధేయత, విజ్ఞత, విశ్వాసం, వికాసం డాక్టర్ బాలకృష్ణయ్య ప్రత్యేకతలు. చైతన్యం అతని ముఖాన చిరునవ్వుగా కళకళలాడేది. చాలా ప్రసన్నంగా వుండడమేగాక చాలా ఓపికతో ప్రసన్నంగా ఎవరినీ నొప్పించకుండా మాట్లాడేవాడు. కత్తిలాంటి చిరునవ్వుతో ఎదుటివారిని తూచేవాడు.
గ్రామ పంచాయతి ప్రెసిడెంటుగా పురజనులకు “పంక్తి భోజనం” ఏర్పాటుచేయడం డాక్టర్ బాలకృష్ణ సంఘసంస్కరణ దృష్టికి ఒక ఉదాహరణ. శ్రీశ్రీని కష్టకాలంలో వనపర్తికి పిలిపించి ఆయనకు వేలాది ప్రజల సమక్షంలో సన్మానం చేసి (పర్సు ద్వారా) సత్కరించడం ఆయన సంస్కారవంత మైన దయాహృదయానికి పరాకాష్ట
ప్రతిఏటా డాక్టర్ బాలకృష్ణ జన్మదినం నాడు ఒక ప్రముఖుని చేత “స్మారకోపన్యాసం” ఇప్పించి దాన్ని పుస్తకంగా వేసి ప్రజల్లో ప్రచారం చేయడం ప్రజాస్వామిక కర్తవ్యం.
పుచ్చలపల్లి సుందరయ్యగారి తమ్ముడు అంతే గొప్ప డాక్టరు. ఆయన ‘నెల్లూరు’లో ప్రజావైద్యశాల తెరచి బీదబిక్కికి ఎన్నో రకాలుగా వైద్యసేవలందించాడు. ప్రమాదకరమైన వ్యాధుల్ని నయం చేశారు. ముఖ్యంగా ప్రమాదకరమైన వ్యాధుల మూలాల్ని కనుగొనే “వైద్య పరీక్షల్ని” సామాన్య ప్రజలకందుబాట్లో వుండేట్లు చేశాడు సుందరయ్యగారి తమ్ముడు.
అలాగే డాక్టర్ బాలకృష్ణయ్య తానే ఒక “నడయాడే వైద్యశాల”గా ప్రజలకందుబాటులో ఉండే డాక్టరుగా ఎంతగానో వైద్యసేవలందించాడు. “ఆ వారసత్వం” కొనసాగేట్లు చూడాలి. అలా వైద్య సేవలందించే నిజమైన ప్రజా వైద్యునికి ఏటా ఒక “పురస్కారాన్ని” అందించేట్లు చూడాలి. ఆమేరకు పురవాసులు అభిమానులు. కుటుంబం వారు ఒక “నిర్మాణాత్మక కమిటీ”గా ఏర్పడి, “వనపర్తి” ప్రజాస్వామిక తత్వాన్ని కాపాడాలి. డాక్టర్ బాలకృష్ణయ్యగారిని ఎన్నోసార్లు కలిశాను. కలిసి సభల్లో పాల్గొన్నాను. వారు చైనా వెళ్లివచ్చారు. అక్కడి ‘అభివృద్ధి’ని చూసి ప్రభావితులయ్యారు.
డాక్టర్ బాలకృష్ణయ్య “చిరునవ్వు” కత్తిలా ఎప్పుడూ మెరుస్తూ నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఆ కత్తి ఎవరికీ అపకారం చేయలేదు. మొండికేసిన రోగాల్ని అది నయం చేయడానికి “శస్త్రచికిత్స” చేసింది. ఫ్యూడల్ ‘వనపర్తి’ సంస్థానంలో డాక్టర్ బాలకృష్ణయ్య ఒక ‘నిశ్శబ్ద విప్లవం’- ఆ నిశ్శబ్దచైతన్యానికి ప్రతినిధి. ఫ్యూడలిజం పట్టు సడలడా నికి ఏర్పడ్డ ఆగ్రహ నిగ్రహం.
డాక్టర్ బాలకృష్ణ స్ఫురద్రూపి కత్తిలాంటి చిరునవ్వు – ప్రవృత్తి రీత్యా ప్రజాసేవ- వృత్తిరీత్యా వైద్యుడు. ఎక్కడా వృత్తికి ప్రవృత్తికి వైరుధ్యం రానీయలేదు. ప్రజలు నొచ్చుకునే పని ఏదీ చేయలేదు. ప్రయోజకులైన పిల్లలు డాక్టర్ బాలకృష్ణయ్యకు “సంస్కారవారసులు”గానే ఎదిగారు కాని, ‘ఆస్తి వారసులు’గా తగాదా పడలేదు. సంతానంలో డాక్టర్లు, సాహితీప్రియులు, సంఘసేవకులు ఉన్నారు.
డాక్టర్ బాలకృష్ణయ్య ఒకరకంగా చెప్పాలంటే ‘వనపర్తి’కి పర్యాయపదంగా నిలిచాడు. ప్రజా చైతన్యానికి, హక్కుల పోరాటాలకు, ప్రజాస్వామ్యానికి బాసటగా నిలిచారు డాక్టర్ బాలకృష్ణ “అహం బ్రహ్మాస్మి” అనుకునే ఎన్టీఆర్ మొదటి రాజకీయ సంక్షోభంలో డాక్టర్ బాలకృష్ణయ్య ఎన్టీఆర్ పక్షానే నిలిచాడు. విధేయత, విజ్ఞత, విశ్వాసం, వికాసం డాక్టర్ బాలకృష్ణయ్య ప్రత్యేకతలు. చైతన్యం అతని ముఖాన చిరునవ్వుగా కళకళలాడేది. చాలా ప్రసన్నంగా వుండడమేగాక చాలా ఓపికతో ప్రసన్నంగా ఎవరినీ నొప్పించకుండా మాట్లాడేవాడు. కత్తిలాంటి చిరునవ్వుతో ఎదుటివారిని తూచేవాడు.
గ్రామ పంచాయతి ప్రెసిడెంటుగా పురజనులకు “పంక్తి భోజనం” ఏర్పాటుచేయడం డాక్టర్ బాలకృష్ణయ్య సంఘసంస్కరణ దృష్టికి ఒక ఉదాహరణ. శ్రీశ్రీని కష్టకాలంలో వనపర్తికి పిలిపించి ఆయనకు వేలాది ప్రజల సమక్షంలో సన్మానం చేసి (పర్సు ద్వారా) సత్కరించడం ఆయన సంస్కారవంతమైన దయాహృదయానికి పరాకాష్ట
ప్రతిఏటా డాక్టర్ బాలకృష్ణయ్య జన్మదినం నాడు ఒక ప్రముఖుని చేత “స్మారకోపన్యాసం” ఇప్పించి దాన్ని పుస్తకంగా వేసి ప్రజల్లో ప్రచారం చేయడం ప్రజాస్వామిక కర్తవ్యం.
పుచ్చలపల్లి సుందరయ్యగారి తమ్ముడు అంతే గొప్ప డాక్టరు. ఆయన ‘నెల్లూరు’లో ప్రజావైద్యశాల తెరచి బీదబిక్కికి ఎన్నో రకాలుగా వైద్యసేవలందించాడు. ప్రమాదకరమైన వ్యాధుల్ని నయం చేశారు. ముఖ్యంగా ప్రమాదకరమైన వ్యాధుల మూలాల్ని కనుగొనే “వైద్య పరీక్షల్ని” సామాన్య ప్రజలకందుబాట్లో వుండేట్లు చేశాడు సుందరయ్యగారి తమ్ముడు.
అలాగే డాక్టర్ బాలకృష్ణయ్య తానే ఒక “నడయాడే వైద్యశాల”గా ప్రజలకందుబాటులో ఉండే డాక్టరుగా ఎంతగానో వైద్యసేవలందించాడు. “ఆ వారసత్వం” కొనసాగేట్లు చూడాలి. అలా వైద్య సేవలందించే నిజమైన ప్రజావైద్యునికి ఏటా ఒక “పురస్కారాన్ని” అందించేట్లు చూడాలి. ఆమేరకు పురవాసులు అభిమానులు. కుటుంబం వారు ఒక “నిర్మాణాత్మక కమిటీ”గా ఏర్పడి, “వనపర్తి” ప్రజాస్వామిక తత్వాన్ని కాపాడాలి. డాక్టర్ బాలకృష్ణయ్యగారిని ఎన్నోసార్లు కలిశాను. కలిసి సభల్లో పాల్గొన్నాను. వారు చైనా వెళ్లివచ్చారు. అక్కడి ‘అభివృద్ధి’ని చూసి ప్రభావితులయ్యారు.
డాక్టర్ బాలకృష్ణయ్య “చిరునవ్వు” కత్తిలా ఎప్పుడూ మెరుస్తూ నాకు జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఆ కత్తి ఎవరికీ అపకారం చేయలేదు. మొండికేసిన రోగాల్ని అది నయం చేయడానికి “శస్త్రచికిత్స” చేసింది. ఫ్యూడల్ ‘వనపర్తి’ సంస్థానంలో డాక్టర్ బాలకృష్ణయ్య ఒక ‘నిశ్శబ్ద విప్లవం’- ఆ నిశ్శబ్ద విప్లవానికి జేజేలు