











2025లో డాక్టర్ బాలకృష్ణయ్య గారి 101 వ జయంతి సంవత్సర వేడుకలు వనపర్తి జిల్లాలో పార్టీలకతీతంగా, వర్గాలకతీతంగా, భారీగా నిర్వహించబడ్డాయి.విగ్రహాలకు పూలమాలలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా సమావేశాలతో శతజయంతి వేడుకలు మహోత్సవంగా నిలిచాయి.
,2024లో డాక్టర్ బాలకృష్ణయ్య గారి శతజయంతి ఉత్సవాలు శ్రీమతి అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వనపర్తి లోని శ్రీ సత్యసాయీ సేవా సమితి (బాబాజీ మఠం)లో, భక్తి–భావపూర్వకంగా, సేవా కార్యక్రమాలతో కలిసి ఘనంగా జరిగాయి. యోగాథాన్, ఉచిత వైద్య శిబిరాలు, “మూలం సంత” వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

















2023లో హైదరాబాద్లోని Elevates Elite Cultural Studioలో, శ్రీమతి అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బాలకృష్ణయ్య గారి శతజయంతి అంకురార్పణ సభ అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు “బాలకృష్ణయ్య స్ఫూర్తి పురస్కారాలు” ప్రదానం చేయడం జరిగింది.